Tuesday, November 17, 2009

కళాకారుడు

ఒంటరిగా తప్ప ప్రవేశించలేని
నిన్ను నువ్వు కాల్చుకుంటే తప్ప
ఏమీ కనబడని చీకటి గుహలో

ప్రతి రాత్రీ..
ఏదో వెతుక్కుంటూ...

* * *

లోతు బావిలో నీళ్ళని
జల్లెళ్ళతో తోడాలని
ప్రయత్నించి ప్రయత్నించి

ఆ బావి గట్టునే..
దాహం తీరకుండానే...

11 comments:

రాధిక said...

చాలా బావుందండి.

Bolloju Baba said...

వండర్ ఫుల్.

క్లుప్తత కవితను విస్తరింపచేస్తోంది.


కవిత్వమొక తీరని దాహం మరి.

Padmarpita said...

చాలా బావుంది.

భావన said...

చాలా బావుందండీ

Vasu said...

మీరు తెలుగు పీపుల్ డాట్ కాం లో రాస్తారు కదా? అక్కడి మీవి చాలా చదివాను.

ఇక మీ ఈ కవిత నాకు అంతు పట్టలేదు. మరీ Abstract గా ఉందేమో అనిపించింది. నా శక్తికి మించినదేమో తెలియదు.

చదవగానే ఏం వెతుకుతున్నాడు, ఎందుకు వెతుకుతున్నాడు, జల్లెళ్ళతో ఎందుకు తోడుతున్నాడు ఇలాటి ప్రశ్నలు వచ్చాయి.

మీ కవిత చెప్పకుండా ఏదన్నా చెప్తోందేమో నాకర్థం కాలేదు. ఈ కవిత లో మీ ఉద్దేశ్యం ఏమిటో వినాలని ఉంది.

కెక్యూబ్ వర్మ said...

ఆ బావి గట్టునే..
దాహం తీరకుండానే...

కవితా బావిగట్టున మీ దాహం తీరకూడదని ఆశిస్తూ..

వేమన said...

Superb !!

sreenika said...

వెతకండి..వెతకండి...వెతుకుతూనే ఉండండి...
మా దాహం తీరేవరకూ....

Kottapali said...

beautiful ..

cartheek said...

ఏదైనా బాగుంటే బాగుందంటాం
నచ్చితే నచ్చిన్దంటాం
చెప్పడానికి మాటలు లేక పోతే
నేనైతే excellent అంటాను

Sudheer said...

సుబ్రహ్మణ్యం గారూ,
పని వత్తిడిలో చిత్తై వచ్చే మాకు,
మీ కవితలు నిజంగా సేద తీరుస్తున్నాయి..
చాలా సంతోషం.