Saturday, May 2, 2009

ఎక్కడికో...

ఇవాళైనా ఏమైనా చెప్తావని

ప్రతి సాయంత్రం నీ తీరానికి వచ్చి

నిల్చుంటాను


మలుపులు తిరుగుతూ

ఏ మార్మికతల్లోకో

మౌనంగా వెళ్ళిపోతావు


కదిలే ప్రవాహంలో

కదలని నీడని చూసుకుంటున్న చెట్టులా

"నేను" మిగిలిపోతాను!

7 comments:

మెహెర్ said...

బాగుంది.

రాధిక said...

ఎవరినైనా పిలిచి వాహ్...అద్భుతం గా రాసారు కదూ అని చెప్పుకోవాలని వుంది.

Bolloju Baba said...

ఇవాళైనా ఏమైనా చెప్తావనిప్రతి సాయంత్రం నీ తీరానికి వచ్చినిల్చుంటాను

అద్బుతం.
మాటలు రావటం లేదు.
ఇలా ఎప్పటికి రాయగలనో

బొల్లోజు బాబా

పరిమళం said...

Beautiful!!

విజయవర్ధన్ (Vijayavardhan) said...

"కదిలే ప్రవాహంలో
కదలని నీడని....."

మణిగారు బాగుంది!

rākeśvara said...

ఏం గారడీ చేస్తారండీ సుబ్రహ్మణ్యంగారు.
మీ టోపీలో చాలా కుందేళ్ళు వున్నాయి.

కదిలే ప్రవాహంలో కదలని నీడని చూసుకుంటున్న చెట్టులా నేను మిగిలిపోతాను!

పారే మీ కవిత్వలో పారని నాదాని నీడని మాత్రం చూసుకుంటూ వడ్డున నేను మిగిలిపోతాను!

rākeśvara said...

రేడియో చిల్లీ పిచ్చా పాటి చాలా బాగుంది.

గిరిజన సంక్షేమ శాఖలో తెలుగు పంతులు గారబ్బాయి. నో వండర్ ;)