1.
కొలనులో చంద్రుడు
తుళ్ళి పడ్డాడు
తూనీగ రెక్క తగిలి
2.
తట్టలో చూసే కాయలు
చెట్టుకే చూడ్డం
ఎంత బావుంది!
౩.
జలపాతానికి
రంగుల ముఖద్వారం
ఇంద్రధనస్సు!
4.
ఒకే తోటలో చెట్లు
కొన్ని పొట్టి
కొన్ని పొడుగు
5.
పావురాళ్ళకి మేత
వాటి కడుపు నిండుతుంటే
నా గుండె నిండుతోంది
6.
దట్టమైన అడవి
ఒకటో రెండో
సూర్య కిరణాలు
7.
ఖాళీ బాల్చీ
నిండుతున్న సవ్వడి
ఏదో చెప్తోంది
8.
పిల్ల కాలువని
మీటుతున్నాయి
మర్రి ఊడలు
9
ఈ సెలయేరు
క్షణం క్రితం
జలపాతం
10.
తామరాకుల కింద
దాక్కుంది
కొలను.
5 comments:
caalaa baavunnaayi sir
మీ చిరుజల్లులు ....మలయ మారుతం అలా తాకి వెళ్ళిన అనుభూతి
చిన్న పదాల్లో ఎంతందంగా చెప్పారు రోజూ చూసేవే అయినా ....
మణి గారు,
చాలా బాగున్నాయి. నాకు
1,6,8 & 10
చాలా నచ్చాయి.
మీ హైకూలు బాగున్నాయి.. సార్
chaala baga chepparu sir...
Post a Comment