Tuesday, June 9, 2009

ఆలాపన

చీపుర్ల సామాజిక స్పృహ
అంటగిన్నెల అస్తిత్వ వేదన
పొద్దుటి రణగొణ ధ్వనుల్ని
చీల్చుకుంటూ...

ఏ రేడియోలోంచో
ఓ ఆలాపన
లీలగా వినిపించి
ఆగిపోతుంది

ఇక నీ మనసు మనసులా ఉండదు
ఏ పని మీదా దృష్టి నిలవదు
ఏదో గుర్తొచ్చినట్టే ఉంటుంది
చిరపరిచిత రాగంలాగే ఉంటుంది
పల్లవి మాత్రం అందీ అందక
రోజంతా వెంటాడుతునే ఉంటుంది

ఆదమరిచి నిద్రించే ఏ అర్ధరాత్రో
అకస్మాత్తుగా ఆ పల్లవి గుర్తొచ్చి
అమితానందంతో పొంగిపోతావు!

3 comments:

పరిమళం said...

చాలా బావుంది ....
సరిగ్గా నాలోకి తొంగి చూసి రాసినట్టుందండీ ....

కెక్యూబ్ వర్మ said...

manasu tarachi choosina anubhooti kalgimdi. thanks.

హను said...

chala baga rasaru, nice