1.
పూవులా వికసించింది
పూలని చూసిన
ఆమె ముఖం
2.
వర్ణించలేను
ఈ పూవులోని
వర్ణాల్ని!
3.
ఎన్ని వక్ర రేఖలో!
రెండు చుక్కల్ని
కలిపేందుకు
4.
దిగేకొద్దీ
లోతు
పెరుగుతోంది
5.
గాడిలో పడేలోపు
ఎన్ని గెంతులో
బొంగరం
6.
బెంచీ పైన అమ్మాయిలూ
బెంచీ పక్కన పూలూ
ఒకటే నవ్వులు
7.
కలిసిపోయాయి
మీద కొమ్మలూ కింద నీడలూ
ఏ నీడ ఏ చెట్టుదో!
8.
పక్క పక్క కొండలు
ఒకటి ఎండలో
మరొకటి నీడలో
9.
వరిచేను గట్టుపై
ఒంటరి సైనికుడు
కొబ్బరి చెట్టు
10.
ఏటి ఇసుక
నీరు పారినంత వరకే
దీని అందం
3 comments:
అన్ని భావాలు బాగున్నాయి.
2,4 కు మిగతా వాటి పక్కన కూర్చునే అర్హత లేదేమో అనిపించింది. మిగతావి బావున్నాయి.
అన్నీ బాగున్నాయి.. 8,9,10 హైకూలు ఇంకా చాలా బాగున్నాయి.
Post a Comment