1.
భూమ్మీద
ప్రతి చెరువులోనూ
మునుగుతాడు
చంద్రుడు
2.
గాలి కచేరీ
చెట్టు నుండి
చెట్టుకి
ఆకుల చప్పట్లు
3.
వెలుగు నీడ
శబ్దం నిశ్శబ్దం
జీవం మృత్యువు
అలవోకగా కలసిపోయి
అడవి
4.
మూసుకుని తెరుచుకోవడంలోనే
జీవమైనా రాగమైనా
చెప్తునే ఉంటాయి
గుండె.. పిల్లనగ్రోవి
5.
అడ్డొచ్చిన వాటిని
తొలగించక
వెలిగిస్తాడు
సూర్యుడు
8 comments:
" మూసుకుని తెరుచుకోవడంలోనే
జీవమైనా రాగమైనా
చెప్తునే ఉంటాయి
గుండె.. పిల్లనగ్రోవి"
బావుంది మీ భావన సుబ్రమణ్యం గారు. చాలా కాలమైంది మీ కవితలు చదివి. మీకు బ్లాగ్ వుందని నాకు తెలియదు. ఆ మధ్య మీ కవిత ఆంధ్రజ్యోతి లో చూసినట్లు గుర్తు.
కల్పనారెంటాల
www.kalpanarentala.blogspot.com
చాలా బాగున్నాయండి మీ భావాలు.
చాలా బాగున్నాయి మీ దివ్వెలు..
"భూమ్మీద
ప్రతి చెరువులోనూ
మునుగుతాడు
చంద్రుడు" చాలా నవ్వు వచ్చేసింది నిజమే కదా అని.
మిగిలినవి కూడా.. రోజు చూసే వాటిని కలిపి చాలా అందం గా అర్ధం చెప్పేరు.
Nice kavitalu.
బావున్నాయి మీ బుల్లి కవితలు !ఆ రెండోది మరీనూ ..
ఈ సారి నాకు అన్నీ చాలా చాలా నచ్చాయి. నేను చదివిన మీ కవితలలో నాకు బాగా నచ్చినవి ఇవేనేమో.
అద్భుతంగా ఉన్నాయి.
మొదటి దాంట్లో భూమ్మీద అని ప్రత్యేకించి చెప్పాలంటారా?
వాసు
Wow..so refreshing!
"రెండు నువ్వులు నేనులు" దాకా చూశా.
మీ కవిత్వం చక్కని మాట నేర్పరితనంతో గుబాళిస్తోంది. ఇందులోని నాల్గో దివ్వె జీవన రాగ దీపం. "గుండె పిల్లంగోవి" అనే శీర్షిక పెట్టి, కొంచెం వొత్తి సవరిస్తే మంచి హైకూలా వెలుగుతుంది.
Post a Comment