వెదురుపొద :
పాటకోసం తూట్లుపొడిచేవాళ్ళే తప్ప
నా గురించి పాడేవాళ్ళే లేరు
పక్కన కూచోబెట్టుకుని
చక్కగా పాడతావు
యుగాలుగా
అలుపెరుగక..
కొండగాలికి నే పాడే పాట
నిజానికి నువ్వు నేర్పిందే
నది :
దాహం తీర్చుకుని
కలుషితం చేసేవాళ్ళే తప్ప
గుండె కరిగి పాడుతున్నా
వినే గుండె లేదు
అంగీకారంతో తలూపుతూ
ఆనందంగా వింటావు
నిరంతరం నీ నీడ
నాలో ప్రతిఫలిస్తుంది
మనల్ని బంధించిన పాట కోసమే
మనిద్దరం
ప్రపంచంతో
పనేమిటీ?
9 comments:
చాన్నాళ్ళకి పలికారు....మధురమైన వేణుగానంలా!
సూపరండీ! మీ టపా చదివిన ప్రతీసారీ ప్రకృతి ఒడిలో కూర్చుని ప్రకృతితో కబుర్లు చెప్తున్న అనుభూతే!!
chaala bhagundandi, aa friendship.
wondeful..
hmmm
baavunnaai subboo
chala bagundanDi
కళ్ళవెంట నీళ్ళు కారాయంటే నమ్మండి। మూలా మరలి వచ్చారన్నమట।
chala bagundi
Post a Comment