౧.
వంట చేస్తుంటే
ఘంటశాల పాట
ఎన్ని విజిల్సొచ్చాయో?
౨.
గేదెలా దోమల్ని
చెవులతో తోలుకోగలిగితే
ఎంత బావుణ్ణు?
౩.
వేరుశనగ పలుకులు
ఒలుచుకు తినాలని
ఈ కోతికెలా తెలిసిందో!
౪.
గేదె
తెల్లబడింది
కాకి వాలగానే
౫.
లిఫ్టులో కొత్తమ్మాయి
వంద అంతస్తులుంటే
ఎంత బావుణ్ణు!
(సెన్ర్యూ : హాస్య రస ప్రధానమైన హైకూ )
6 comments:
"గేదెలా దోమల్ని
చెవులతో తోలుకోగలిగితే
ఎంత బావుణ్ణు?"
హ హ హ
ఏవిటేవిటీ? ఇవి హాస్యరసప్రధానమయిన కవితల్లాంటి స్రెన్యూలా? నాయనా సుబ్రహ్మణ్యం, ఎందుకు, అహా అసలు ఎందుకు అని అడుగుతున్నా
ఏవిటో ఈ పనసకాయంత వెఱ్ఱి
ఎక్కడికి దారితీస్తుందో అని
భయంతో వణుకుతున్నారు
మణి గారు,
నాకివి నచ్చాయి.
౪.
గేదె
తెల్లబడింది
కాకి వాలగానే
౫.
లిఫ్టులో కొత్తమ్మాయి
వంద అంతస్తులుంటే
ఎంత బావుణ్ణు!
లిఫ్టులో కొత్తమ్మాయి
వంద అంతస్తులుంటే
ఎంత బావుణ్ణు!
lol
4, 5 అద్భుతంగా ఉన్నాయండీ.
Lift kavita adirindi. Sorry for the text in English!
Post a Comment