అప్పుడప్పుడు ఆమె
మౌనాన్ని వీడి
కళ్ళతోనే..
రెండు మాటలు
నా దోసిట్లో..
రెండు పువ్వులు
* * *
నవ్వుతూ తుళ్ళుతూ
ఆ నదిలో పువ్వులు
ఏ తీరాలకో...
ఒడ్డున
తృప్తిగా నేను.
* * *
మళ్ళీ..ఆ నదీ తీరాన
నిరంతర ధ్యానంలో ఆమె
ఆమె ముందు మోకరిల్లి
నిరీక్షణలో నేను
కల్పాలు గడిచిపోతుంటాయి.
6 comments:
మీ 'రెండు పువ్వులు' చాలా బాగున్నాయండీ :)
నేనిదే మొదటిసారి అనుకుంటా మీ బ్లాగుకి రావడం. మీ పేరు చూసి నేను చాలా చాలా ఆశ్చర్యపోయానండీ.! ఎందుకంటే, కౌముదిలో వచ్చిన, మీరు (మీరే కదూ.!?) రాసిన 'కొండవాగులో బంతి' కథ నాకు చాలా చాలా నచ్చిందండీ.! మళ్ళీ మళ్ళీ చదవాలనుకునే అతి తక్కువ కథల్లో అదొకటి :) నా స్నేహితులకి కూడా పంపించి చదవమంటూ ఉంటాను ఆ కథ. అక్కడ కౌముదిలో మీ కథ చదివాక, క్రిందున్న మీ ఫోటో చూసి బోలెడు ఆశ్చర్యపడిపోయానండీ.!! ఇంత చిన్నవయసున్న రచయిత ఆ కథ రాశారంటే ఎందుకో చాలా అబ్బురంగా అనిపించింది. మీ కథలు వేరేవి ఇంకేమీ చదవలేదండీ.. నెట్లో వేరే వెబ్ పత్రికల్లో ఎక్కడైనా మీ కథలు ప్రచురితమయ్యి ఉంటే కాస్త ఆ లింకులు ఇచ్చి పుణ్యం కట్టుకొండీ దయచేసి..!
సున్నితమైన కవిత ....బాగుంది
Super @ Subbu
మీ రెండు పువ్వులు నాలుగు కాయలు కావాలని ఆశిస్తూ!!
caalaa caalaa baagunnaayandi
chala bagunnayi
Post a Comment