కరెంటు పోయిన
నవంబరు రాత్రి
ఒంటరిగా నేను
కొవ్వొత్తి
రాత్రి
మౌనంగా
కరుగుతుంటాయి
ఏ పిలుపు
తన గుండెని మ్రోగిస్తుందోనని
మొబైలు ఫోను చూస్తుంటుంది
గడియారపు సెకెన్ల ముల్లు
గదిలో మౌనపు లోతుల్ని
కొలుస్తుంటుంది
హృదయాకాశంలో
దిగంతాల దాకా వ్యాపించిన
దిగులు మబ్బులు
ఇందాకే వాన కురిసి
కిటికీకవతలి ప్రపంచాన్ని
కడిగేసింది
ఏ వాన కురిసి
నా లోపలి ప్రపంచాన్ని
కడగనుందో!
11 comments:
బాగున్నాయి.
బాగుంది.
cinema పరిభాషలో beats working up to a climax! ఇలాంటివి ఇంకా వ్రాయండి.
Beautiful!
చాలా బాగున్నాయండీ..
నాదో ప్రశ్న,
నేను బాగుంది అన్నాను.
ఇతరులు బాగున్నాయి అంటున్నారు.
ఇంతకీ ఏది సరైనది అంటారు?
నా దృష్టిలో ఇది ఒకటే కవిత.
కానీ మీ హైకూలకు పాఠకులు బాగా అలవాటు పడిపోయినట్టున్నారు.
వానతో కలిసి కదిలిన వాన పూల పరిమళం బాగుంది..
beautiful sir as usual
i too got the doubt as expressed by rakeswara rao sir. :)
bolloju baba
బావున్నాయి
చాలా బాగుందండీ.
Nice post and this enter helped me alot in my college assignement. Gratefulness you as your information.
Post a Comment