Sunday, January 23, 2011

మంచు


చలికాలపు సాయంత్రం
ఎవ్వరూ లేని బాట మీద
ఏకాకి నడక.

రాలిన ఆకుల కింద
ఎవరివో గొంతులు

ఎక్కడో దూరంగా
నిశ్శబ్దపు లోతుల్లోకి
పక్షి పాట

లోయంతా సూర్యుడు
బంగారు కిరణాలు పరుస్తున్నా
కాసేపటికి ఆవరించే చీకటి మీదకే
పదే పదే మనసుపోతోంది

కర్రపుల్లల కొసన నర్తించే
ఎర్రని చలిమంటలోకి
ప్రవేశించాలనిపిస్తోంది.

కురిసే మంచు
నా గొంతులో
ఘనీభవిస్తోంది.

ఈ క్షణం నా పాటకి
మాటల్లేవు!

10 comments:

budugoy said...

చాలా బాగుంది.

కెక్యూబ్ వర్మ said...

కర్రపుల్లల కొసన నర్తించే
ఎర్రని చలిమంటలోకి
ప్రవేశించాలనిపిస్తోంది.

బాగుంది సార్..

rākeśvara said...

అఱ్ఱె నేనూ నిన్ననే మంచు మీద ఒక పాట వ్రాసాను.
మంచు కొందలమీద ఆడుతూ, కానీ ఈ పాటికి మర్చిపోయినట్టున్నాను.

చాలనాళ్ళకు మీ కవిత్వం చూడడం బాగుంది.

రవి said...

మీకు కవితలు రాయడానికి ప్రేరణ ఎలా కలుగుతుందో తెలుసుకోవాలనుంది.

ఈ కవిత చదవగానే జిడ్డుకృష్ణమూర్తి వ్యాసమొకటి గుర్తుకు వచ్చింది.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

కవిత చాలా బావుంది

Nagaraju said...

plz read for information on following blogs
gsystime.blogspot.com - telugu
galaxystimeblogspot.com - english
galaxystartime.blogspot.com - animation engines

Thanks

సుజాత వేల్పూరి said...

అదీ! ఇలా ఉండాలి కవితంటే! తనతో పాటు పాఠకుడిని నడిపించాలి.

చాలా బాగా రాశారు

రహ్మానుద్దీన్ షేక్ said...

చాలా బావుంది

రహ్మానుద్దీన్ షేక్ said...
This comment has been removed by the author.
BALASIDDAIAH said...

amazing...