Friday, February 10, 2012

నీలికాంతి

ఒళ్ళంతా
పూలు పూసే చెట్టులా
ప్రతి రాత్రీ నువ్వు

సీతాకోక చిలకనై
నేను!

* * *

వీణ తీగలే
నన్ను మీటుతున్నాయి
నీ ముంగురులు

మౌనాన్ని
భగ్నం చేయకుండా
ఒక రాగం లీలగా

* * *

పరుచుకున్న నీలికాంతిలో
నక్షత్రాలు మన చుట్టూ
నాట్యమాడుతున్నాయి చూడు!

4 comments:

మధురవాణి said...

Lovely! :)

మరువం ఉష said...

>> "వీణ తీగలే"

వీణ తీగలై -లేదా- వీణ తీగలల్లే

అనుకుంటా. మొదటిపాదం బావుంది.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

Excellent

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

"వీణ తీగలే
నన్ను మీటుతున్నాయి
నీ ముంగురులు

మౌనాన్ని
భగ్నం చేయకుండా
ఒక రాగం లీలగా"

అందమైన భావన!