వరిచేలు పచ్చగా లేవు
మట్టి దిబ్బలు ఎర్రగా లేవు
ప్రకృతి రంగులన్నిటినీ
దోచేసుకుని రాత్రి
ఎటో పారిపోతోంది
తూరుపు కొండ చాటున
మాటు వేసిన సూర్యుడు
రాత్రి మీద దాడిచేసి
వేటి రంగుల్ని తిరిగి
వాటికే ప్రసాదించాడు
గడ్డిపరక మీద
రెండు కన్నీటి బొట్లు విడిచి
రాత్రి మాయమైంది!
10 comments:
Beautiful! :)
వ్వావ్....బహుబాగు :-)
ఇంత బాగా ఎలా వ్రాస్తారు?
గడ్డిపరక మీద
రెండు కన్నీటి బొట్లు విడిచి
రాత్రి మాయమైంది!అద్భుతమయిన భావన! చాలా బాగుందండీ!
ఇప్పుడు మన హీరో సూర్య (సూర్యుడు) అనమాట ;)
wow... AWESOME...!!
బావుందండీ
గడ్డిపరకల మీద నీటి బిందువులుపై మీ కవిత శాశ్వతంగా నిలిచిపోతుంది.
chala baagundi..simply superb.
chaalaa baagundandee manchi bhavukatha undi mee kavithalo
అద్భుతమైన భావన...ఎంత సున్నితంగా చెప్పారు!!!
చాలా అందంగా ఉంది..!!
simply beautiful!! :) :)
అక్షరాలు కుమ్మక్కయి తమ వెనుక దాచుకున్న కవితలన్నిటినీ బలే లాగుతున్నారు మా కోసం।
Post a Comment