Monday, June 29, 2009

నీలో నేను

ప్రపంచపు రంగులన్నీ చీకట్లో కరిగిపోతుంటే
మన దేహాలు కొత్త రంగులు సంతరించుకుంటాయి

అర్ధరాత్రి ఆకాశం
అందమైన సెలయేటిలో
ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ
తనని తాను వెతుక్కున్నట్టు

నీలో..
నన్ను నేను వెతుక్కునే
ప్రయత్నంలో..

నేనే
మరో పసిపాపనై
నీ గర్భాన నిద్రించడం
ఎంత బావుంది!

సృష్టి
మనిద్దరి ఆసరాతో
మరొకడుగు ముందుకేస్తోంది!

8 comments:

మాగంటి వంశీ మోహన్ said...

బాగుంది సుబ్రహ్మణ్యంగారూ మీ "స్త్రే" థాట్ ....

ఎగతాళి కాదూ, పేరడీ కాదు కానీ....ఈ మీ కవిత చదివాక ఈ క్రిందిది రాయాలనిపించింది... :)

ప్రపంచపు కవితలన్నీ కాష్టంలో కాలిపోతుంటే
ప్రజనుల శరీరాలు కొత్తగా వెలుగుతుంటాయి
ప్రపంచపు కవితలన్నీ కాష్టంలో కాలిపోతుంటే
ప్రజనుల శరీరాలు కొత్తగా వెలుగుతుంటాయి

అపరాత్రి ఆవేశం
ఉగ్రమైన కళ్ళలో
ఒళ్ళంతా కాల్చేసుకుని మరీ
వేరేవారిని వెతుక్కున్నట్టు
అపరాత్రి ఆవేశం
ఉగ్రమైన కళ్ళలో
ఒళ్ళంతా కాల్చేసుకుని మరీ
వేరేవారిని వెతుక్కున్నట్టు

కవితలో...
కోతలని వెతుక్కునే
ప్రయత్నంలో
కవితలో...
కోతలని వెతుక్కునే
ప్రయత్నంలో

కవితనే
మరో కోణంలో
చీల్చి చెండాడడం
ఎంత బావుంది!
కవితనే
మరో కోణంలో
చీల్చి చెండాడడం
ఎంత బావుంది!

కాష్టం
కవితల ఆసరాతో
పైపైకి ఎగబాకుతోంది!
కాష్టం
కవితల ఆసరాతో
పైపైకి ఎగబాకుతోంది!

మీకూ, నాకూ పడదు అని ఎవరయినా చెబితే మటుకు అలా అదే చేత్తో ఒక కవితుచ్చుకు కొట్టండి...చెల్లుకు చెల్లు అవుతుంది... :)

కెక్యూబ్ వర్మ said...

మీ కవిత చాలా బావుంది. పేరడీ రాసిన వారిలో అంత కోపం ఎందుకో అర్ధం కాలేదు.

Bolloju Baba said...

మాగంటి వారూ :-)
ఏమిటిదీ?

ఏవిటో ఈయన మాటలే కాదు పాటలు కూడా అర్ధం కావు. సుబ్బుగారూ మీకేమైనా అర్ధం అయ్యిందా?
(శంకరాభరణం స్టైల్ లో)
:-)))

ఆత్రేయ కొండూరు said...

మాగంటి వారితో .. నాకవితలతో... నేనిక కామెంటెట్టను అనిపించాను. మొత్తానికి ఓ పాటే రాయించారు సుబ్బూ.. బాగుంది. బాబాగారూ.. ఇప్పుడు సుబ్బుగారు.."అర్ధంఅయింది మాష్టారూ.. " అంటే మనం ఇబ్బందిలో పడిపోతాము.

వంశీగారూ.. "చేతనైనంత మట్టుకు చిరువానల్ని సృష్టిస్తున్నారంతా.. చివరికి కాకి కూడా.." అన్నారెవరో..

ఇంతేసంగతులు చిత్తగించవలెను.

Bolloju Baba said...

aatrEya gaaru

that "pun intended" with due respects to maganti vaaru.

subbugaaru
kavita caalaa baagundi.

ఆత్రేయ కొండూరు said...

అయ్యో same here బాబా గారూ..
what i meant to say was.. if subu gaaru says he understood the paradii.then,. we will be the ones left out unable to understand-the comments from Maganti.
and i was comparing myself with a crow and said trying to write some pertry, though its not upto his expectations.. i tried to make that comment in Maganti gaari style ఎదో లేండి, మొత్తనికి బెడిసికొట్టింది. నాకూ ఎవరినీ కించ పరిచే ఉద్దేశ్యం లేదు.. ఊరికే కాస్త సరదా జేశానన్న మాట.

పరిమళం said...

"సృష్టి
మనిద్దరి ఆసరాతో
మరొకడుగు ముందుకేస్తోంది! "
excellent!

Anonymous Techie from Bangalore said...

super!