Monday, December 24, 2007

ప్రేమ

నీ స్పర్శే నాలోని పాటని మేల్కొలిపింది
నేను పూర్తిగా నీలో మునిగి ఉంటాను
కేవలం మనిద్దరి కలయికనీ చూడ్డానికే
ఒకర్నొకరు తోసుకుంటారు సూర్యచంద్రులు

పూవులు రాలిపోతుంటాయి
యుగాలు గడిచిపోతుంటాయి
నువ్వు మాత్రం నా మీంచి ప్రవహించి
ఎల్లప్పటికీ నన్ను తేటగానే ఉంచుతావు

మన విషయంలో మరుపు,జ్ఞాపకం
మొదలైన మాటలకి అర్ధమే లేదు
గులకరాయి తన సెలయేటిని
గుర్తుంచుకోడమూ, మర్చిపోడమూనా!

2 comments:

పద్మ said...

:) బావుంది. మీంచి కన్నా మీద నించి అంటే బావుండేదేమో సుబ్రహ్మణ్యం గారూ.

గులకరాయి సెలయేరు కలయిక చూడటం కోసం సూర్యచంద్రులు తోసుకోవటం అంటే?

కొత్త పాళీ said...

బ్లాగు మొదలెట్టారా? చాలా సంతోషం. స్వాగతం.