Thursday, March 27, 2008

మంచులోయలో..

పైన్ చెట్ల మధ్యనుంచి
ప్రవేశించింది సంధ్య

సాయంకాలపు నిశ్శబ్దం
లోయంతా ఆవరించింది

లీలగా వినపడుతున్న
సెలయేటి సవ్వడి
చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని
రెట్టింపు చేస్తోంది!

2 comments:

రాధిక said...

ఒక అందమయిన చిత్రాన్ని/ప్రదేశాన్ని కన్నుల ముందు ఆవిష్కరించారు.నిశ్శబ్ధాన్ని కూడా వినగలుగుతున్నాను నేను మీ మాటల్లో.

తెలుగు అభిమాని said...

మీ భావుకులతో వచ్చిన చిక్కే ఇది. మా కళ్ళకు మీరు చూసేవి ఏవీ కనిపించవు. మీరు వినగలిగే ధ్వనులు మేము వినిపించుకోము. మెరుపుల కాంతిలో చీకటైన కళ్ళకు మిణుగురులు మీరు చూపించగలరు. ఉరుముల రొదలో చిల్లులు పడిన చెవులకు చినుకుల సవ్వడి వినిపించగలరు.