మలిసంధ్య వేళ మనిద్దరం
ఎదురుగా సముద్రం
నీ చేయి నా చేతిలో..
గచ్చు మీద పడిన గోళీల్లా
మాటలన్నీ చెల్లా చెదురయ్యేదిప్పుడే!
* * *
నీ చేతిని నా చేతిలోకి తీసుకోగానే
నీలోంచి బయలుదేరి ఒక నది
నాలోకి ప్రవహించడం నాకు తెలుస్తోంది.
మాటలు మోయలేని ఎన్నో భావాల్ని
తనతో మోసుకొస్తోంది.
5 comments:
Awesome!!
సరళత అంటే ఏమిటో అనుకునేదానిని.గొప్ప కవిత్వం రాయడానికి పెద్ద,బరువైన పదాలు అవసరం లేదన్నమాట.మీ ప్రతీ కవితా చదువుతూ ఉంటే తపస్సు చేస్తున్నట్టు,చదివాకా అద్వితీయమయిన భావమేదో పొందినట్టు అనిపిస్తాయి.
గచ్చు మీద పడిన గోళీల్లా
మాటలన్నీ చెల్లా చెదురయ్యేదిప్పుడే!
ఒక సందేహం. గచ్చుమీద పడిన గోళీలు అంటే, చెదిరిన లేదా చిందరవందర అన్న అర్ధాన్నిస్తాయి. అంటే ప్రేమికుల మాటల తూటాలు, ఆవేశకావేశాలు అనా మీ అర్థం? కానీ తరువాతి పంక్తుల్లో అనిర్వచనీయమైన (మంచి) అనుభూతులు అంటున్నారు. ఆ మొదటి ప్రయోగం యొక్క అన్వయం మీరెలా చెప్పదల్చుకున్నారు? అంటే ప్రేమికుల నడుమ జరిగే రెండు విరుద్ధభావాలని చెప్పదల్చుకున్నారా?
వివరించగలరు.
వికట కవి గారికి నమస్తే,
చేతి స్పర్శ మొదట తడబాటు, తత్తరపాటు, ఎలెక్ట్రిక్ షాకు, కలిగిస్తాయని, అప్పుడు మాటలు అలా గతితప్పినట్లు గానే, గోళీల్లల్లే, కొంచెం గడబిడ అవుతాయని -- నేను అనుకుంటున్నాను.
ఇక ఆ మొదటి " జలదరింపు" తరువాత నెమ్మది నెమ్మదిగా, ఒక నది (అనంత హృదయ స్పందనల ప్రవాహం), ప్రవహించటం ఒక అనిర్వచనీయ అనుభూతి.
కవితను ఇంత సూటిగా, పదాడంబరం లేకుండా, భావాలను స్పష్టంగా ఆవిష్కరించటం, నాకైతే ఒక గొప్ప ముచ్చటగానూ, ఒక అద్భుతంగానూ, నేనెప్పటికైనా చేరుకోగలనా ఈ స్థాయిని అనిపించే అనుమానాన్ని, కలిగిస్తుంది.
అనంతానంత అభినందనలతో,
సాహితీ యానం.
simple and simply superb
Post a Comment