Wednesday, October 15, 2008

రెండు కవితలు

1. యోగులు

ప్రవాహంతో తమకి నిమిత్తం లేదని
భూమిలోకి ఇంకిపోయే నీటి బొట్లు సైతం
మూలాల్ని వెతుక్కునే పనిలో
వృక్షాలకి సాయపడుతున్నాయి!

2. కళాకారులు

ఆకాశంలో ఎగిరే
అందమైన కొంగలు
బురదలో వాలాయి
ఆహారం కోసం !

6 comments:

Bolloju Baba said...

మొదటిది ఫిలసాఫికల్ గా అద్భుతంగాఉంది.
రెండవది ప్రాక్టికల్ గా నిర్వేదంతో ఉంది.
చాలా బాగున్నాయి మీ కవితలు
బొల్లోజుబాబా

oremuna said...

వహ్వా వహ్వా

ఏకాంతపు దిలీప్ said...

చాలా బాగున్నాయండి..

నిషిగంధ said...

రెండోది చాలా బావుంది!

Anonymous said...

beautiful poems. Reminds me of 'ramakrishna kathaamrutam'.

Anonymous said...

Chaala nachaayi!