Monday, October 27, 2008

చిచ్చుబుడ్డీ

నింగివైపే చూస్తూ

నిటారుగా నిలబడతాను


చిన్న స్ఫూర్తి చాలు

చీకట్లని చీల్చుకుంటూ

అవిశ్రాంతంగా

ఆనందపు రవ్వలు

ఆకాశాన్ని చుంబించాలని

ఆరాటపడతాయి

నా జీవితం

ముగిసిపోయిందనుకుంటున్నారేమో..


చప్పట్లు కొడుతూ

గెంతులు వేస్తున్న

చిన్నారి కళ్ళలోకి

ఒక్కసారి చూడండి!

5 comments:

శ్రీసత్య... said...

చాలా బాగుంది.మీకు బ్లాగ్లోకం తరపున "దీపావళి" శుభాకాంక్షలు....

శ్రీసత్య...

MURALI said...

గురువుగారు మీరు కేకండి. సాదారణ కవితని అద్భుతమైన ముగింపుతో గొప్ప కవిత గా మార్చేసారు.

Bolloju Baba said...

మురళి గారన్నట్లు సాధారణ కవితకు అద్బుతమైన ముగింపిచ్చారు.
అవును మరి చిన్నారి కళ్లలోని ఆవెలుగు ఒక జ్ఞాపకమై ఒక జీవితకాలం పాటు వెలుగుతూంటుంది. ఎంత అందమైన భావన.
చాలా బాగుంది.

బొల్లోజు బాబా

భాస్కరభట్ల రవికుమార్ said...

excellent...chalabagundi..

Anonymous said...

సుబ్రహ్మణ్యం గారూ,
"చిచ్చు బుడ్డీ" చదివాను..ముగింపుతో మనసుల్ని దోచుకున్నారు..
ఇంతమందికి ఇంతలా అలౌకిక ఆనందాన్నిస్తున్న మీకు మా వందనాలు..

సుధీర్