Monday, April 13, 2009

ప్రేమ

చినుకు చినుక్కీ
పులకించిపోయే
సెలయేటివి నువ్వు

నిలువునా కురిసి
తేలికపడే
నీలిమబ్బుని నేను

గమనించావా..
ఇద్దరిలోనూ
ఒకే తడి!

6 comments:

పరిమళం said...

ప్రకృతి - పురుషుల్ని తలపింప చేసే చిన్ని కవిత ! బావుందండీ !

మెహెర్ said...

చాలా బాగుంది.

rākeśvara said...

చాలా బాగుంది. మొదటి రెండు పద్యాలూ చాలా బాగున్నాయి.
మూఁడొవది అవసరం లేదనుకుంటగదా?

ఆత్రేయ కొండూరు said...

కన్నీరొలికిన మబ్బును చూసి
సెలయేరు పులకించిందో

తన కన్నీరు నింపుకుని పరవళ్ళు
తొక్కే సెలయేరును చూసిన మబ్బు తేలికపడిందో

ఏమో .. ఒకటే తడి.. భావాలే వేరు.

శేఖర్ పెద్దగోపు said...

అద్భుతంగా ఉంది.

దయచేసి వర్డ్ వెరిఫికేషన్ ని తీసివేయండి.

కిన్నెరసాని కవితా ప్రసాద్ said...

Chala Baagundi.