Wednesday, June 23, 2010

మరో పువ్వు


ఈ సెలయేటిలో దాహం తీర్చుకుంటాను
ఈ చెట్టు నీడలో విశ్రమిస్తాను
వచ్చిపోయే మేఘాల్ని లెక్కించడంలో
మధ్యాహ్నమంతా గడిచిపోతుంది

సాయంకాలం
గూళ్ళని చేరే పక్షులతోపాటు
నా మనసుకూడా
పాటనుండి క్రమంగా
మౌనంలోకి ప్రయాణిస్తుంది

అర్ధరాత్రి నిశ్శబ్దంలో
ఆత్మనొక పుష్పంగా
వికసింపజేసే రహస్యం
ప్రతిమొక్కా నాకు
చెప్తునే ఉంటుంది

వేకువ కాంతిలో
వెలిగిపోతూ
నీ పాదాల చెంత..
మరో పువ్వు!

15 comments:

కొండముది సాయికిరణ్ కుమార్ said...

Beautiful @ Subbu.

ramnarsimha said...

Very nice..

U R a true nature-lover..

ll expect more..

Thanq..

ఎం. ఎస్. నాయుడు said...

ఠాగూర్ గుర్తుకొచ్చాడు

ramnarsimha said...

@Subramanyam:-

I agree with Mr.Naidu..

ప్రసూన said...

అర్ధరాత్రి నిశ్శబ్దంలో
ఆత్మనొక పుష్పంగా
వికసింపజేసే రహస్యం
ప్రతిమొక్కా నాకు
చెప్తునే ఉంటుంది ...

woow ...wonderful Subbu.

ramnarsimha said...

@PRASOONA..Garu,

Your poem is very nice..

Now..I cld understand

Why God created the Plants..

Thanq..

హను said...

nice one anDi.

భావన said...

అర్ధరాత్రి నిశ్శబ్దంలో
ఆత్మనొక పుష్పంగా
వికసింపజేసే రహస్యం
ప్రతిమొక్కా నాకు
చెప్తునే ఉంటుంది -- ఎంతో బాగుంది.. కరిగిపోని మెలకువ అర్ధరాత్రి ని కళ్ళ ముందు ఆవిష్కరింప చేసినట్లు.

చిలమకూరు విజయమోహన్ said...

బాగుంది

పరిమళం said...

Beautiful!!

rākeśvara said...

ఈ బ్లాగులో కవితలు చదువుతుంటాను
ఈ పెట్టె చోటులో వ్యాఖ్యానిస్తాను :D

చాలా బాగుంది। ముగించిన తీరు అద్భుతం॥

రాధిక(నాని ) said...

chaalaa baagundandi.

ప్రసూన said...

@Narsimha garu. Thank you very much.

Unknown said...

Hi This is Krishna Murthy, ur Blog is so nice...... keep it like this forever....

రవి వీరెల్లి said...

చాలా బాగుంది. కొస మెరుపు నచ్చింది.