Sunday, July 1, 2012

ఎంత సాధన చేసీ...

క్షణాలు.. యుగాలు..
గోళీల్లా దొర్లిపోతుంటే..
నాలో నేను..
నాతో నేను..

అర్ధరాత్రి ప్లాట్ ఫాం మీద
నల్ల పలకల బెంచీలన్నీ నిద్ర జోగుతుంటే
మంచులో తడుస్తున్న పట్టాల్ని చూస్తూ
నేనొఖ్ఖణ్ణే...
చీకటి వెలుగుల మధ్య
నిరీక్షించాను

చలికాలపు సాయంత్రం
ఆకులన్నీ రాలిన చెట్టు కొమ్మలా
ఆకాశాన్ని
గుచ్చి గుచ్చి ప్రశ్నించాను

లోపలా బయటా
వెలిగిపోతూ సాగిపోయే
నదిలో దీపంలో
ఆత్మని ఐక్యం చేసి
అన్వేషించాను

ఎంత సాధన చేసీ
ఏ దుమ్మూ అంటని పసికళ్ళని
మళ్ళీ అందుకోలేకపోయాను

5 comments:

Padmarpita said...

వృధా ప్రయాసంటారా?

the tree said...

manchi feeling;

Anonymous said...

pasikaLLani aMdukOvaalaMTE aikyaM chEyaalsiMdi pasivaaLLalO. deepaMlO, aakaaSaMlO vetikitE elaa ;-).
-unome

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

Good one.Loved these lines


లోపలా బయటా
వెలిగిపోతూ సాగిపోయే
నదిలో దీపంలో
ఆత్మని ఐక్యం చేసి
అన్వేషించాను

ఎంత సాధన చేసీ
ఏ దుమ్మూ అంటని పసికళ్ళని
మళ్ళీ అందుకోలేకపోయాను

కామేశ్వరరావు said...

కళ్ళకంటిన దుమ్ము కడిగెయ్యడానికి కన్నీళ్ళొక్కటే సాధనం కాబోలు!