Thursday, January 17, 2008

చిరుజల్లులో పూలు

1.
తడుస్తున్నాం
చిరుజల్లులో పూలూ
నీ పాటలో నేనూ

2.
ఒక్క క్షణం కనిపించి
మళ్ళీ మాయమైంది
ఆకుల మధ్య జాంపండు

3.
ఎప్పటికైనా
కుదురుగా ఉంటుందా?
కోడిపుంజు మెడ

4.
బంతి మొక్క
ఎండిన పువ్వు పక్కనే
వికసిస్తున్న మరో పువ్వు

5.
పడవ నన్నూ
పాట నా మనసునూ
ఏవో తీరాలకి...

6.
అలికిడి మొదలైంది
మంచులో తడిసిన పూల మీద
దుమ్ము చేరుతోంది

7.
కిరణాలతో
కిటికీ బొమ్మ గీసాడు
సూర్యుడు

8.
గంట కొట్టి
కళ్ళుమూసుకుంది
ఏం కోరుకుందో!

9.
తవ్వుతున్నకొద్దీ
రంగులు మారుతోంది
మట్టి

10.
పసిపాప గుప్పెట్లో
నా చూపుడు వేలు
బంధాలు ఎంత గట్టివి?

11.
పాత కోవెల
రాతి స్తంభాలు
చల్లగా తగిలాయి

12.
రాళ్ళపై నడిచాకా
అరిపాదాలకి గడ్డి
మరింత మెత్తగా..

13.
ఎవరు పులిమారో
రాతి రంగే
ఈ తొండకి

14.
సాయంత్రం తోటలో
రక రకాల పక్షులు
బృందగానం

15.
దారి పొడుగునా
రాలిన పూలు
నడక ఎంత ఇబ్బంది?

1 comment:

Bolloju Baba said...

తవ్వుతున్నకొద్దీ
రంగులు మారుతోంది
మట్టి
అంతకు మించి ఎవరేం చెప్పగలరు మనసుగురించి.


దారి పొడుగునా
రాలిన పూలు
నడక ఎంత ఇబ్బంది?
ఇంతకు మించి ఎవరేంచెప్పగలరు సున్నితత్వం గురించి.

అద్భుతం గురూజీ,
బొల్లోజు బాబా