Wednesday, April 16, 2008

గుడిగంటల మౌనం

గుడిగంటలు
మౌనంలోకి జారుకుంటాయి
చంద్ర కిరణాలు
కోనేటిని చేరుకుంటాయి

చిరుగాలి సైతం అలసిపోతుంది
ఆకుల శబ్దం ఆగిపోతుంది
వెన్నెలని నిండా కప్పుకుని
గన్నేరు చెట్టు నిద్రపోతుంది

గాయాలన్నీ మానిపోతాయి
సమస్యలన్నీ సమసిపోతాయి
నక్షత్రాల్లా మెరిసిపోతూ
అక్షరాలొక్కటే మిగిలిపోతాయి

4 comments:

S said...

"వెన్నెలని నిండా కప్పుకుని
గన్నేరు చెట్టు నిద్రపోతుంది "
-బాగుందండీ!

రాధిక said...

నిజమే అక్షరాలొక్కటే మిగిలిపోతాయి.చాలా బాగుందండి.

Anonymous said...

Hi Subramanyam gaaru,
mee kavithalu telugupeople.com loo chadiveevaanni. ee madya atugaa vella leedu. malli mimmalni ekkada kalusukoovatam chala santooshangaa vundi.
enkoka vishayam, Raghothama Rao annayyanu miss ayyaanu. eppudu aayana ekkada unnaaru?? annayya blogs names pampeedi. my mail-id: muralib12@gmail.com

Bolloju Baba said...

మీ బ్లాగులో చాలా చాలా మంచి కవిత్వం వ్రాస్తున్నారండి. మంచి భావాలు, చిన్నచిన్న మాటలు, హాయైన పదచిత్రాలు.
మంచి కవిత్వం.
బొల్లోజు బాబా