Friday, July 11, 2008

వెంటాడే పిలుపు

ప్రతి రాత్రీ
సముద్రం నన్ను
"రా.. రా.. "
అని పిలుస్తుంది.

పారే నది నాకు
దారి చూపుతుంది.

చంద్రుడు దారంతా
వెలుతురు పరుస్తాడు

చిన్ని పడవలో
ఒంటరిగా నేను.

5 comments:

మాగంటి వంశీ మోహన్ said...

ఊరుకోండి సుబ్రహ్మణ్యం గారూ, మీరు మరీనూ...రా..రా అని పిలవగానే పరిగెత్తుకుంటూ పడవలేసుకెళ్ళి ఒంటరిగా నదుల్లో సముద్రాల్లో ఏం చేస్తారు, ఈ లోపల అమావాస్య వొస్తే ఎలా ?

Just kidding

Vamsi

Bolloju Baba said...

ఒక్కో కవితను చదువుతూఉన్నప్పుడు ఆయా పదాల వెనుక నున్న భావాలు వివిధ రకాలు గా అనిపించటం నిజంగా ఆ కవిత యొక్క గొప్పతనమే.

ఈ చిన్ని కవితనే తీసుకుంటే వివిధ దృశ్యాలు వివిధ పొరలలో కనిపిస్తున్నాయ్.

ఒక్కో పొరా వలుచుకుంటూ పోతే లోపల వజ్రసమానమైన రససిద్ధి.

ఇక్కడ సముద్రమంటే ప్రేయసి/ఆశయం/శాంతి/మోక్షం/........

నది అంటే జ్ఞాపకాలు/కృషి/ధ్యానం/భక్తి/..........

చంద్రుడు అంటే ప్రేమ/పట్టుదల/నిద్ర/దేముడు/......

ఒంటరిగా: జీవితంలో ప్రతిఒక్కరూ ఒంటరిగానే పైన చెప్పిన పనులు చేయవలసి వస్తుంది.

ఇక చిన్నిపడవ అంటే ఈ దేహం.


ఇలా అన్వయించుకుపోతే ఈ చిన్ని చిన్ని పదాల వెనుక అనేక అర్ధాలు గోచరించటం లేదూ?
అలా వివిధ స్థాయిలలో అనిపించేలాచేయటం ఉత్తమ కవిత్వం యొక్క లక్షణం.
అభినందనలతో

బొల్లోజు బాబా

రాధిక said...

baba gaaruu thanks.

spandana said...

నాకయితే ఈ కవిత "రాధిక"ను అనుకరించడానికి చేసిన విఫలమైన ప్రయత్నంలా అనిపిస్తోంది. నా వాఖ్య మిమ్మల్ని బాధిస్తే క్షమించండి.

వంశీ గారూ,
మీ వాఖ్య అదుర్స్!

--ప్రసాద్
http://blog.charasala.com

Purnima said...

బాబాగారు.. కవిత అర్ధం..అంతం అంతలా చెప్పిన మీకు నెనర్లు!!