Friday, August 29, 2008

కవిత్వం మీద రెండు కవితలు

1.
మేఘాల భారాన్ని
చినుకుల్లోకి అనువదించేసే
ఆకాశానికి తెలుసు
అసలు రహస్యం

2.
లోపలి సంగీతానికి
అనుగుణంగా నర్తించే
అక్షర నక్షత్రాల
మ్యూజికల్ ఫౌంటైన్ !

2 comments:

Bolloju Baba said...

చాలా బాగున్నాయి.
చాలా మంచి ఇమేజెస్.
కవిత్వం మీదే నేను వ్రాసిన కవితను మీకు వీలైతే చదవగలరు.

బొల్లోజు బాబా

Anonymous said...

manchi bhavachitralu.

-mallavarapu prabhakara rao(mallavarapujohn.blogspot.com)