Thursday, December 11, 2008

ఆమెకు

నిన్న రాత్రి వసంతం
చిన్నగా కబురంపింది
తనకి రావడం కుదరదని
తన స్నేహితురాల్ని
పంపుతున్నానని

ఎవరో అనుకున్నా
తలుపు తెరిచి చూస్తే
ఎదురుగా నువ్వు!

***

నువ్వు నదివైతే
ఇప్పుడే నా పడవకి
చిల్లు పెట్టేసుకోనూ!

***

కొళాయి పకపకమని
గంట సేపు నవ్వితేనే
బిందె నిండుతుంది

నీ చిన్ని చిరునవ్వుతోనే
నా గుండె నిండిపోతుంది

7 comments:

Bolloju Baba said...

అద్బుతంగా ఉన్నాయండీ.

ప్రపుల్ల చంద్ర said...

చాలా బాగున్నాయి...

Unknown said...

అద్భుతం !

రాధిక said...

చాలా చాలా బాగున్నాయి

పరిమళం said...

చాలా బాగున్నాయండీ.

Anonymous said...

Baagundi :)

rākeśvara said...

@ కొళాయి - మీ కళ్ళజోడు మాయా కళ్ళజోడండి సుబ్రహ్మణ్యంగారు. :)