Sunday, February 8, 2009

వెదురుపొద

వేణువుగా మలచొద్దు
కచేరీలసలే వద్దు
చప్పట్లు నా మౌనాన్ని
భగ్నం చేస్తాయి

అడుగుజాడల్లేని
అడవిలో..
ఇలా..
ఈ నది ఒడ్డున
వెదురుగానే ఉండిపోనీ

ఎప్పుడో వీచే
ఏ కొండగాలి స్పర్శకో
పరవశించి పాడుతూ..

7 comments:

Padmarpita said...

బాగుందండి మీ కవిత...

పరిమళం said...

beautiful!

పరిమళం said...

సుబ్రహ్మణ్యం గారూ !మీ బ్లాగ్ మొదటి సారి చూస్తున్నా .మీ కవితలు చిన్నచిన్న పదాలతో చక్కటి భావ వ్యక్తీకరణతో ఉన్నాయండీ .ఆనంద యోగులు ,నది , చుచ్చు బుడ్డి ........చాలా బావున్నాయండీ .

Anonymous said...

mee kavitalalO marO vishwambhara kanapaDutundi nAku. abhinandanalu. :)

Devi said...

ఆహా! అనిపించింది చదవగానే. చాలా బాగుంది. నేనెప్పుడో రాసుకున్న "వెదురుగా-పుట్టాక"ని గుర్తుకు తెచ్చింది మీ కవిత.

కొత్త పాళీ said...

"చప్పట్లు నా మౌనాన్ని
భగ్నం చేస్తాయి"
So very true.

మెహెర్ said...

బాగుంది.