Thursday, July 21, 2011

మళ్ళీ నువ్వే

కేవలం నీ చూపు సోకే
నేనో నదినై ప్రవహించాను

దిగంతాల్లో వెలిగే నక్షత్రాల్ని
నా లోతుల్లోకి ఆహ్వానించాను

జలపాతాన్నై
అగాధాల లోతుల్ని
అన్వేషించాను

నా అస్తిత్వాన్ని రూపు మాపేందుకు
అల్లంత దూరంలో
అంతులేని సముద్రానివై
మళ్ళీ నువ్వే!

3 comments:

అక్షర మోహనం said...

నదిని0డా అలలున్నట్లు, ప్రతి పదం నిండా కవిత్వము0ది. ఏటి ఒడ్డున కూర్చొని మళ్ళీ మీరే రాయగలరు.

Afsar said...

@మోహనా, అదే సుబ్రహ్మణ్యం అంటే! మంచి కవిత. సముద్రమంత భావన...గుప్పెడు మాటల్లో!

మనసు పలికే said...

చాలా చాలా బాగ రాసారు..అద్భుతం..:) నిజంగా సముద్రమంత లోతైన భావన కనిపిస్తుంది..